← Back to news

చేయూత పింఛన్ గడువు పెంచండి: కేవీపీఎస్

By Kamal· 19h ago· Tandur, Tandur, Vikarabad
చేయూత పింఛన్ గడువు పెంచండి: కేవీపీఎస్

చేయూత పింఛన్ దరఖాస్తుల గడువును వెంటనే పొడిగించాలని కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ.. నెట్‌వర్క్, సాంకేతిక సమస్యలతో పాటు ఆదాయ, కుల, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం జరిగిందని తెలిపారు. దీంతో పలువురు అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారన్నారు. అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం వెంటనే గడువు పెంచాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

More in Local