చెరువుకు గండి.. కొట్టుకుపోయిన చేపపిల్లలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రామసాగరం, దాచారం గ్రామాల పరిధిలోని తుమ్మలచెరువుకు భారీ వర్షాలతో గండి పడింది. దీంతో చెరువులో కొద్ది రోజుల క్రితం దాచారం గ్రామానికి చెందిన ముదిరాజులు వదిలిన చేప పిల్లలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. చేప పిల్లలు నీటిపాలవడంతో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ముదిరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చెరువు నుంచి నీరు వృథాగా బయటకు వెళ్లిపోతుండటంతో వారు స్వయంగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.



