← Back to news

పోలీసులకు థాంక్స్.. ధ్రువ్ రాఠీ

By Prashanth· 7h ago· X
పోలీసులకు థాంక్స్.. ధ్రువ్ రాఠీ

ధ్రువ్ రాఠీను అరెస్ట్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు ‘X’ యూజర్లపై నోయిడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నెల 16న ధ్రువ్ అరెస్ట్ అయినట్లు కొన్ని అకౌంట్లు పోస్టులు పెట్టగా, అందులో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ పోస్టులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని FIR‌లో స్పష్టం చేశారు. ఈ చర్యలకు నోయిడా పోలీసులకు ఆయన <a href="https://x.com/dhruv_rathee/status/2111851774290325661?s=20">థాంక్స్ చెప్పారు</a>. తప్పుడు ప్రచారం చేస్తున్న మరో ఇద్దరు X యూజర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు.

More in National