← Back to news

చింతూరు–వీఆర్ పురం మధ్య రాకపోకలు బంద్

By MD ALI· 1d ago· Chinturu, Polavaram

పోలవరం జిల్లా చింతూరు డివిజన్‌లో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. వీఆర్ పురం మండలంలో భారీ వర్షాలకు అన్నవరం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో వాగుకు ఎగువన ఉన్న సుమారు 40 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు–వీఆర్ పురం ప్రధాన రహదారిపై కూడా వరద నీరు ప్రవహిస్తుండటంతో రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. రహదారులు బంద్ కావడంతో కూలి పనులకు వెళ్లే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

More in Local