సూపర్ మార్కెట్‌లో షాకింగ్ చోరీ

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఉన్న శ్రీనివాస్ సూపర్ మార్కెట్‌లో చోరీ జరిగింది. దొంగలు షట్టర్ పగులగొట్టి దుకాణంలోకి ప్రవేశించి రూ.1.25 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.



