← Back to news

13 అడుగుల బతుకమ్మతో సంబరాలు

By BK· 7h ago· నల్గొండ
13 అడుగుల బతుకమ్మతో సంబరాలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, వేడుకల్లో ఏర్పాటు చేసిన 13 అడుగుల బతుకమ్మ అట్రాక్షన్‌గా నిలిచింది. రంగురంగుల పూల బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. ఈ ప్రోగ్రామ్‌కి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు హాజరయ్యారు. వేడుకలతో కాలేజ్ గ్రౌండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

More in TG