← Back to news

రోడ్డు భద్రతపై అవగాహన

By DK· 4h ago
రోడ్డు భద్రతపై అవగాహన

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని చిత్తూరు బస్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్‌ సీఐ చాంద్‌ బాషా ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు పలు సూచనలు చేశారు. బైక్‌ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగించవద్దని సూచించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ వెంట ఉంచుకోవడంతో పాటు వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ ఉండేలా చూసుకోవాలని చెప్పారు.

More in Local