MEO ఆఫీస్‌లో టెన్త్ సర్టిఫికెట్లు
మంగళగిరి నిర్మల CBSE స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థుల 2024 బ్యాచ్ ఒరిజినల్ సర్టిఫికెట్లను MEO ఆఫీస్‌లో అందజేయనున్నట్లు తెనాలి డిప్యూటీ DEO శాంతికుమారి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన వివరాలతో హాజరై తమ సర్టిఫికెట్లను తీసుకోవాలని సూచించారు. స్టూడెంట్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.



