← Back to news

జంబూ సవారీకి ముస్తాబైన మైసూరు ప్యాలెస్‌

By Prashanth· 2h ago· X

దసరా జంబూ సవారీ ఊరేగింపుకు మైసూరు ప్యాలెస్‌ ప్రాంగణంలో ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏనుగులు చాముండేశ్వరి అమ్మవారికి పుష్పాంజలి సమర్పించే కార్యక్రమాన్ని ప్రాక్టీస్‌ చేసింది. పోలీసు బలగాలు, మార్చింగ్‌ బ్యాండ్లు కూడా కవాతు నిర్వహించాయి. ఈ నెల 11 నుంచి 21 వరకు జరుగుతున్న దసరా ఉత్సవాల్లో విజయదశమి రోజున జంబూ సవారీ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. బంగారు అంబారిని మోసే ఏనుగు నేతృత్వంలో ప్యాలెస్‌ నుంచి బన్నిమంటప్‌ వరకు ఊరేగింపు సాగనుంది.

More in National