← Back to news

వర్షాల జోరు.. బయ్యారంలో నిండిన చెరువులు

By Bala· 5h ago

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. బయ్యారం పెద్ద చెరువు పూర్తిగా నిండి మత్తడి పోస్తుండగా, చిన్న చెరువులు, కుంటలు సైతం నిండుకుండలా మారాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో రానున్న రోజుల్లో సాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో మండలంలో పలు ప్రాంతాలు జలకళను నీటితో నిండిపోయాయి.

More in Local