వెల్లంపల్లి గ్రామంలో మహిళ దారుణ హత్య

AP: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి సమీపంలో శ్రీదేవి (35) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా ఆమె వెల్లంపల్లి గ్రామంలో ఒంటరిగా నివసిస్తుంది. ఘటనాస్థలంలో ఆమె పక్కనే ఉన్న రాయిపై రక్తపు మరకలు కనిపించడంతో.. అదే రాయితో కొట్టి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



