అరెస్ట్, డిటెన్షన్ మధ్య తేడా ఏంటి?

నిరసనల్లో పోలీసులు కొందరిని డిటైన్ చేశారని, మరికొందరిని అరెస్ట్ చేశారని వార్తల్లో వింటుంటాం కదా! ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అరెస్ట్ అంటే నేరానికి సంబంధించి ఒకరిని చట్టం ప్రకారం అదుపులోకి తీసుకోవడం. డిటెన్షన్ అంటే విచారణ కోసం లేదా శాంతిభద్రతల సమస్యలు రాకుండా తాత్కాలికంగా అదుపులో ఉంచడం. సింపుల్గా చెప్పాలంటే, పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఏ చట్టం ప్రకారం తీసుకున్నారు అనేదాన్ని బట్టి అది అరెస్టా, డిటెన్షనా అనేది తెలుస్తుంది.



