ఈరోజు వరల్డ్ ఫుడ్ డే.. ఈ డే స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డే ఆర్గనైజ్ చేస్తారు. ఆకలిని తగ్గించడం, అందరికీ పోషకాహారం అందించడం, ఫుడ్ వేస్ట్ను తగ్గించడంపై అవగాహన కల్పించడమే ఈ డే ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి (UN) ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ఆధ్వర్యంలో జరిగే ఈ ఏడాది థీమ్ “Innovate Today. Nourish Tomorrow” (నేడు కొత్త ఆలోచనలు.. రేపటి పోషకాహారం). టెక్నాలజీ, కొత్త పద్ధతులతో ఆహార ఉత్పత్తిని మెరుగుపరచి, భవిష్యత్తులో అందరికీ పోషకాహారం అందించడమే లక్ష్యం.



