PF బ్యాలెన్స్ నుంచి విత్డ్రా వరకు.. అంతా Appలోనే!

PF అకౌంట్ హోల్డర్స్ ఇక PF సర్వీసుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ UMANG యాప్లోనే UAN జనరేట్, యాక్టివేట్ చేసుకోవడంతో పాటు PF బ్యాలెన్స్ చెక్, పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. PF డబ్బుల విత్డ్రా కోసం ఆన్లైన్లో క్లెయిమ్ కూడా పెట్టుకోవచ్చు. క్లెయిమ్ స్టేటస్ను ట్రాక్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది. ఈ సేవల కోసం ఆధార్, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్ అవసరం. UAN సేవలకు ఫేస్ అథెంటికేషన్ కూడా కంపల్సరీ.



