నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: బీజేవైఎం
ములుగు జిల్లా కేంద్రంలో నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మాదరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెలకు ₹.4,000 నిరుద్యోగ భృతి అందించాలని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరారు.



