చదువులో సత్తా.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చీలాపూర్‌లో ఈవ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. మొదటి స్థానం సాధించిన వారికి ₹1,500, రెండో స్థానం పొందిన వారికి ₹1,000 చొప్పున నగదు బహుమతులు ఇచ్చారు. ఇంటర్, ఎస్‌ఎస్‌సీ, ఏడో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సంస్థ ప్రతినిధులు ఆకాంక్షించారు.



