మోకాళ్లపై కూర్చొని NHM ఉద్యోగుల నిరసన

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ఆరోరోజు కొనసాగింది. ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య శాఖలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.



