← Back to news

ఉదయగిరి నియోజకవర్గంలో భారీ వర్షం

By SARDHAR PAKIRAYYA· 1d ago· Potti Sriramulu Nellore

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, కలిగిరి మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట పొలాలు అదును వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ వర్షం సాగుకు అనుకూలంగా ఉందని కొందరు రైతులు తెలిపారు. మరోవైపు, వర్షం కారణంగా రాత్రి వేళల్లో కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో మరమ్మతులు చేపట్టారు.

More in Local