జెడ్పీటీసీ బరిలోకి టి. ఆనంద్ పౌల్

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో జనసేన పార్టీ ZPTC అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా టి.ఆనంద్ పౌల్‌ను అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు.



