← Back to news

పారిశ్రామిక కాలుష్యంపై స్థానికుల ఆందోళన

By prakash kumar· 1d ago· Narayanpet

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చెగుంట, జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలోని సైదాపూర్, కాడేచూర్ గ్రామాల ప్రజలు పారిశ్రామిక కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాడేచూర్ పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో వెలువడుతున్న రసాయన వాయువులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో శ్వాస సంబంధిత సమస్యలు, కళ్ల మంటలు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

పారిశ్రామిక కాలుష్యంపై స్థానికుల ఆందోళన
పారిశ్రామిక కాలుష్యంపై స్థానికుల ఆందోళన

More in Local