MPTC, ZPTC ఎలక్షన్ల షెడ్యూల్

విశాఖ జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రానుంది. ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లో 4 జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 21 నుంచి నామినేషన్లు తీసుకుంటారు. జడ్పీ కార్యాలయంలో ZPTCలకు, మండల ఆఫీసుల్లో MPTCలకు నామినేషన్ల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ వచ్చే నెల 3న ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్గా జడ్పీ CEO నారాయణమూర్తి వ్యవహరిస్తారు.



