NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వినతి

మహబూబ్‌నగర్‌లో NHM జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో నారాయణపేట NHM జేఏసీ జిల్లా అధ్యక్షుడు కాశాపోగు ప్రసాద్ పాల్గొని, జాతీయ ఆరోగ్య మిషన్‌లోని 78 క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ NHM జేఏసీ అధ్యక్షుడు సునీల్ జేఏసీ నాయకులతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరికి వినతిపత్రాలు అందజేశారు.



