టిడిపి నుంచి వజ్జ గంగాభవాని నామినేషన్

శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన వజ్జ గంగాభవాని ఆదివారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, పసుపు జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతామని గంగాభవాని తెలిపారు.



