దుర్గా మాత ఆలయంలో చండీయాగ హోమం

నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని దుర్గా పరమేశ్వరి మాత ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీయాగ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్, అదనపు కలెక్టర్లు భుజంగరావు, పి. సురేష్, డీఎంహెచ్‌వో రాజశ్రీతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



