నిండుకుండలా సంఘం కాలువ
వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు నుంచి పంట పొలాలకు సాగునీరు అందించే సంఘం కాలువ నిండుకుండలా ప్రవహిస్తోంది. గోదావరి జలాలను పాకాల సరస్సులోకి విడుదల చేస్తుండగా, అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. సంఘం కాలువలో ప్రవాహం పెరగడంతో పరిసర ప్రాంతాల్లో జలకళ కనిపిస్తోంది. సాగునీరు అందుతుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



