← Back to news

కత్తిపోట్లకు గురై యువకుడు మృతి

By Srikanth Goud· 4h ago· Jagitial

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బొంత సంతోష్ (19) కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. సంతోష్ కుటుంబం ధర్మారంలో అద్దెకు ఉంటుండగా, అనిల్ కుటుంబం రాజారాంపల్లిలో నివసిస్తోంది. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. బతుకమ్మ వేడుకల అనంతరం సంతోష్‌, అనిల్‌తో గొడవ పడటడంతో అనిల్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వెల్గటూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More in Local