← Back to news

నాగమల్లేశం మృతిపై నాయకుల సంతాపం

By ప్రశాంత్· 1d ago· Siddipet
నాగమల్లేశం మృతిపై నాయకుల సంతాపం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రామసాగరం గ్రామ సర్పంచ్ ఇంగాల లక్ష్మి భర్త నాగమల్లేశం అనారోగ్యంతో మృతి చెందారు. గతంలో బెజ్జంకి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన ఆయన గ్రామ అభివృద్ధి, ప్రజా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాగమల్లేశం మృతి కుటుంబానికి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.

More in Local