భీమవరంలో బతుకమ్మ సంబరాలు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరంలో సర్పంచ్ వంట్లా రమేష్, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన 400 మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, పూలు పంపిణీ చేశారు. ఐదు అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేసి మహిళలతో కలిసి సర్పంచ్ రమేష్ కోలాటాలు, నృత్యాలతో అర్ధరాత్రి వరకు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చీకటి చైతన్య, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.





