హైలెవెల్ బ్రిడ్జి పనుల పరిశీలన

మహబూబాబాద్ జిల్లా గార్ల రాంపురం వద్ద పాకాల ఏటిపై నిర్మాణంలో ఉన్న హైలెవెల్ బ్రిడ్జి పనులను పీఎస్సీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, మైనంపాటి ప్రవీణ్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ బ్రిడ్జి సాధన కోసం కృషి చేసిన CPI, కాంగ్రెస్ నాయకులను, త్వరగా పనులు పూర్తి చేస్తున్న అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ లీడర్లు పాల్గొన్నాయి.



