← Back to news

అనుమతులు లేకుండానే చెట్ల నరికివేత

By Yadla Venudhar· 1d ago· Suryapet
అనుమతులు లేకుండానే చెట్ల నరికివేత

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా 46చెట్లను నరికివేశారు. గ్రామ సర్పంచ్ కందాల పూలమ్మ కుమారుడు, గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కందాల రామకృష్ణారెడ్డి ఘటనకు పాల్పడినట్లు అటవీ అధికారులు గుర్తించారు. గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ కోసం అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా 41టేకు చెట్లు, 5వేప చెట్లను నరికినట్లు తెలిపారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

More in Local