← Back to news

అల్లినగరంలో ఘనంగా గ్రామ దేవత ఉత్సవాలు

By Sagar· 1d ago· Srikakulam

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో ఆదివారం గ్రామదేవత దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా సంప్రదాయంగా ఉత్సవాలు జరుపుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు కొలిచే దుర్గమ్మను దర్శించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

More in Local