← Back to news

దేవాలయ భూమిని రీసర్వే చేయాలి: అడ్వకేట్

By Naresh Kumar· 1d ago· Vikarabad
దేవాలయ భూమిని రీసర్వే చేయాలి: అడ్వకేట్

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మల్కాన్‌గిరిలోని హనుమాన్ దేవాలయానికి చెందిన 22ఎకరాల 19 గుంటల భూమిని వెంటనే రీసర్వే చేసి, సరిహద్దులు నిర్ధారించాలని అడ్వకేట్ రవికుమార్ డిమాండ్ చేశారు. 1950లో కరణం రామచంద్రరావు ఈ భూమిని దేవదాయ శాఖకు దానంగా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం భూమి సాగులో లేకపోవడంతో ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని దేవాలయ ట్రస్టు ఆధీనంలోకి తీసుకుని సాగులోకి తెచ్చి, ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించాలని కోరారు.

More in Local