జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ నిమజ్జనాలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకుని సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. చెరువులు, కుంటలు, పుష్కరఘాట్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళల కోలాహలం, బతుకమ్మ పాటలతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.




