ప్రయాణికులతో కిక్కిరిసిన వరంగల్ బస్టాండ్
వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సద్దుల బతుకమ్మ పండుగ, ఆదివారం సెలవు కావడంతో మహిళలు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి పండుగ జరుపుకునేందుకు పలువురు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్‌లో తీవ్ర రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాల్సి ఉండగా, అదనపు బస్సులు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఫైరవుతున్నారు.



