← Back to news

ఇంటి ముందు కంచె వేసి బెదిరింపులు

By THOORPATI RAJASHEKAR· 1d ago· Warangal

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్వయ్యపల్లిలో ఇంటి ముందు ఇనుప కంచె వేసి రాకపోకలను అడ్డుకున్న ఘటన వెలుగుచూసింది. బాధితుడు వాంకుడోత్ హర్జీ తెలిపిన వివరాల ప్రకారం, పాతకక్షలతో గ్రామానికి చెందిన నలుగురు తన ఇంటి గేటు ముందు సిమెంట్ స్తంభాలు పాతి కంచె వేశారు. కుటుంబంతో బయటకు వస్తే నరికి చంపేస్తామని బెదిరిస్తున్నారని హర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి కంచె తొలగించి, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

More in Local