క్లియర్ కట్ న్యూస్ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పెండిప్రోలు గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై క్లియర్ కట్ న్యూస్‌లో వచ్చిన <a href="https://www.theclearcutnews.com/n/YuqV2RY">వార్త</a>కు అధికారులు వెంటనే స్పందించారు. కరెంట్ స్తంభానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించి, 3 నెలలుగా పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారిన స్తంభాన్ని క్లియర్ చేశారు. దీంతో కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. పబ్లిక్ ప్రాబ్లమ్స్‌ను బయటపెట్టి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో క్లియర్ కట్ న్యూస్ కీలక పాత్ర పోషిస్తుందని గ్రామస్తులు అభినందిస్తున్నారు.



