జెడ్పీటీసీ బరిలో మెట్టుకూరి శిరీషారెడ్డి

నెల్లూరు జిల్లా కలిగిరి మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ మెట్టుకూరి శిరీషారెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఖరారు చేశారు. మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవిరెడ్డి సతీమణి అయిన శిరీషారెడ్డి ఎంపికపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కలిగిరి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మెట్టుకూరి నాయకత్వంలో 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకుని పార్టీకి కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు.




