← Back to news

అక్లూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు

By Samrat Ashok· 6h ago· Nizamabad
అక్లూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలు

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో సర్పంచ్ జిన్నా జనార్దన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ జిన్నా జనార్దన్ మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు.

More in Local