← Back to news

పూసపల్లిలో బతుకమ్మ సంబరాలు

By @ Alam· 8h ago· Bhadradri Kothagudem
పూసపల్లిలో బతుకమ్మ సంబరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం 21 పిట్ ఏరియాలోని పూసపల్లిలో సర్పంచ్ ధనసరి స్రవంతి రాజు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లందు పట్టణంలోని వాడవాడలా, బస్తీ బస్తీల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగ సంబరాలతో పట్టణమంతా సందడిగా మారింది.

More in Local