2011 సెన్సస్ తో దక్షిణాదికి అన్యాయమే..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ఎంపీ సీట్లు జనాభా బట్టి సమానంగా ఉండాలి.తాజా సవరణ ద్వారా 'జనాభా' నిర్వచనాన్ని పార్లమెంటు తన ఇష్టానుసారం నిర్ణయించేలా మార్పులు ప్రతిపాదించారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపులో పార్లమెంటుకు మరిన్ని అధికారాలు దక్కుతాయి. ఇది నియోజకవర్గాల విస్తీర్ణంపై ప్రభావం చూపుతుంది. కేంద్రం ఎవరికీ అన్యాయం జరగదని, దక్షిణాదికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని అంటోంది. 2011 సెన్సెస్ ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోంది. దీనివల్ల దక్షిణాదికి దెబ్బే.. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న జనగణన చాలా టైమ్ పట్టేలా కనిపిస్తోంది.



