ప్రభాదేవిలో బతుకమ్మ సంబరాలు

ముంబయి ప్రభాదేవి శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రభాదేవిలోని అంబేడ్కర్ నగర్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. వాటి చుట్టూ తిరుగుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయ ఆట పాటలతో సందడి చేశారు. ఇందులో మహిళా శాఖకు చెందిన శారద ఎక్కల్దేవి, మేఘమాల వంగరి, శారద యెలిగేటి, అశ్విని కటకం, కవిత వల్లకాటి, జ్యోతి కన్నా, సంగీత గుండు, వందన చిలివేరి, శోభా రాపోలు తదితరులు పాల్గొన్నారు.





