← Back to news

కెనాల్లో పడి ఏడేళ్ల బాలుడి గల్లంతు

By Bala· 21h ago
కెనాల్లో పడి ఏడేళ్ల బాలుడి గల్లంతు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బాంజీపేట శివారులో విషాదం జరిగింది. కెనాల్‌లో దిగి ఏడేళ్ల బాలుడు ఎండీ తాహెర్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడిని తాత గఫ్ఫార్ మోటార్‌సైకిల్‌పై కెనాల్ వద్దకు తీసుకెళ్లగా ఈ ఘటన జరిగింది. బాలుడిని కాపాడేందుకు తాత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై భరత్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

More in Local