← Back to news

వీధికుక్కల దాడులు.. ప్రజల్లో ఆందోళన!

By Samrat Ashok· 19h ago· Nizamabad
వీధికుక్కల దాడులు.. ప్రజల్లో ఆందోళన!

నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో వీధికుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఆరుగురిని కరిచిన ఘటన మరువకముందే, ఆదివారం కచేర్‌ ఏరియాలో మరోసారి కుక్కలు పలువురిపై దాడి చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొండి అశోక్ సూచించారు. వీధికుక్కల బెడదను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

More in Local