చిత్తూరులో ఎన్నికల సన్నద్ధతపై అధికారుల సమీక్ష
చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఎల్. శివ శంకర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై సమీక్ష కొనసాగింది.



