మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారి దర్శనం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీచౌక్‌లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు దేవీచౌక్‌కు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.



