రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ఆదివారం బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఎండపల్లికి చెందిన రాజయ్య, కొండాపూర్‌కు చెందిన క్రాంతి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



