గిరిజన ప్రాంతాల్లో అన్రిజర్వ్డ్ సీట్ల కలకలం

అల్లూరి జిల్లా కూనవరం మండలంలో ఉన్న 8 ఎంపీటీసీ స్థానాల్లో రొటేషన్ సిస్టమ్ వల్ల పెదార్కూరు, చూచిరేవులగూడెం, వెంకటాయపాలెం స్థానాలు ఈసారి అన్రిజర్వ్డ్గా మారాయి. విశేషమేమిటంటే.. ఈ మూడింట్లో గిరిజన ఓటర్లే మెజారిటీ. ఇక్కడ అన్రిజర్వ్డ్ అవ్వడంతో ఇతర కులాల కాండిడేట్లు పోటీకి క్యూ కడుతున్నారు. అయితే, అక్కడ ఎవరు పోటీ పడినా గెలుపోటములను డిసైడ్ చేసేది మాత్రం ఆదివాసీ ఓటర్లే.



