బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌లోని ఫెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు బతుకమ్మను ఎత్తుకుని మహిళలతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని మంత్రి తెలిపారు.



