← Back to news

సద్దుల బతుకమ్మ వేళ.. పూల సేకరణ

By THOORPATI RAJASHEKAR· 1d ago· Warangal
సద్దుల బతుకమ్మ వేళ..  పూల సేకరణ

ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగ ఉండడంతో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో సందడి నెలకొంది. బతుకమ్మలను పేర్చేందుకు అవసరమైన తంగేడు, గుమ్మడి, టేకు, బంతి పూల సేకరణలో యువకులు నిమగ్నమయ్యారు. పొలాలు, చెరువు గట్లు, అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ పూలను సేకరిస్తున్నారు. మరోవైపు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెల్లో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది.

More in Local