మందమర్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మంచిర్యాల జిల్లా మందమర్రిలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. 11వ వార్డు మూడవ జోన్ ఏరియాలో మహిళలంతా రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనతో పాటు మహిళల ఐక్యతను చాటిచెబుతుందని పేర్కొన్నారు. భావితరాలకు తెలంగాణ సంప్రదాయాలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.




